హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కమ్మ, వెలమ సంఘాలకు ప్రభుత్వం 5 ఎకరాల చొప్పు న కేటాయించిన భూమికి మారెట్ విలువను అంచనా వేసేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ భూముల కేటాయింపునకు సంబంధించి 2021 జూన్ 30న వెలువడిన జీవో 47కు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
ఆ రెండు సంఘాలకు ఇచ్చిన భూములకు మారెట్ విలువను నిర్ణయిచేందుకు అనుమతించాలన్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ విన్నపాన్ని హైకోర్టు ఆమోదించింది. అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను నివేదించాలని పేర్కొన్నది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదన్న గత ఉత్తర్వులను కొనసాగించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.