భూపాలపల్లి రూరల్, జూలై 17 : జయశంకర్ భూపాలపల్లి(Bhupalapalli) జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సింగరేణి ఉపరితల (Singareni OC Mines) బొగ్గు గనుల్లో భారీగా నీరు(Heavy water), మట్టి చేరి ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి ఓసీ-2, 3 గనుల్లో 6 వేల టన్నులు, తాడిచర్ల ఓసీలో 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని, దాదాపు సింగరేణికి రూ. కోటి వరకు నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. కాగా, వర్షాలు తగ్గుము ఖం పట్టిన వెంటనే పనులు ప్రారంభింస్తామని అధికారులు పేర్కొన్నారు.
అన్నారం బరాజ్ వద్ద నిలిచిన పరీక్షలు
మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో అన్నారం (సరస్వతి) బరాజ్ అప్ స్ట్రీమ్‌లో చేపట్టిన రెండో దశ జియో ఫిజికల్ పరీక్షలు బుధవారం నిలిచిపోయాయి. 29, 30వ గేట్ వద్ద పుణె నుంచి వచ్చిన సీడబ్ల్యూపీఆర్ఎస్ రెండో బృందం వారం రోజులుగా బోర్ వెల్ వేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాన తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ పరీక్షలు చేపడతామని ఇంజినీర్లు తెలిపారు.