హైదరాబాద్ : దసరా పండుగ నేపథ్యంలో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) ఏర్పడుతున్నది. బతుకమ్మ, దసరా(Dasara) ఉత్సవాలు ముగియడంతో పల్లెలకు తరలిన ప్రజలు హైదరాబాద్ బాట పట్టారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడురు టోల్ గేట్ వద్ద సాంకేతిక లోపంతో లోపం ఏర్పడింది. దీంతో వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవేపై(Warangal-Hyderabad, National highway) భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Warangal | ఆగిన గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ : వీడియో
Madusudhana Chary | శాసనమండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతల స్వీకరణ
Manne Krishank | మెయిన్‌హార్ట్ లీగల్ నోటీసులకు భయపడం.. తేల్చిచెప్పిన మన్నె క్రిశాంక్