హైదరాబాద్ : పెద్దపల్లి(Peddapally) జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై(Sultanabad Rajiv Road) భారీగా ట్రాఫిక్ జాం(Heavy traffic jam) అయింది. బాలిక హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక బంధువులు రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కాగా, జిల్లాలో ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్యచేశాడో దుర్మార్గుడు. గురువారం రాత్రి తన తల్లితో కలిసి రైసు మిల్లులో నిద్రిస్తున్న బాలికను.. అదే మిల్లులో డ్రైవర్గా పనిచేస్తున్న బలరాం అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు.
సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అయితే అర్ధరాత్రి సమయంలో తన పక్కన బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులతో కలిసి పరిసరాల్లో వెతికారు. ఈ క్రమంలో విగత జీవిగా పడిఉన్న ఆమెను గుర్తించారు. అనంతరం నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు బాలికన ఎత్తుకెళ్తున్న దృష్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.