Kamareddy rains | కామారెడ్డి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. అలుగు దుంకుతున్నాయి. వర్షాల ధాటికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు కాలు తీసి బయటపెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. కాగా వర్షాల నేపథ్యంలో వరద ఉధృతితో జాతీయ రహదారిని 44 తాత్కాలికంగా మూసివేశారు.