TG Rains | తెలంగాణలో గతవారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఇప్పటికే వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ చేసింది వాతావరణశాఖ. ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలుంటాయని తెలిపింది.
ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.