హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో పిడుగు పడి ఇల్లు ధ్వంసమైంది.
మహబూబాబాద్ జిల్లా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వట్టి వాగు బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో కేసముద్రం – గూడూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం వద్ద లోయర్ బ్రిడ్జి నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పెద్ద ముప్పారం -దంతాలపల్లి మద్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగు
మహబూబాబాద్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో వాన దంచికొట్టింది. 1868 ఎంఎం వర్షం కురిసింది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వరంగల్-ఖమ్మం రహదారిపై పంథిని సమీపంలో ప్రధాన రహదారిపై వరద ప్రవాహం కొసాగుతుండటంతో భారీ వాహనాలు మినహా రాకపోకలు బంద్ అయ్యాయి.
వరంగల్ జిల్లాలో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గుట్టల నుంచి వచ్చే వరద నీరు ఒర్రే( కాలువ) నుంచి వెలిశాల చెరువులోకి వెళ్లి అక్కడి నుండి చలివాగులు కలవాల్సి ఉంది. కానీ వరదఎక్కువ కావడంతో పెద్దంపల్లి ఎస్సీ కాలనీతో పాటు పంగిడిపల్లి,ఆసిరెడ్డిపల్లి గ్రామాల్లోని ఇండ్లలోకి వరద నీరువచ్చి చేరింది. ఆసిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలోకి వరద నీరు చేరి వంట సామగ్రి తడిసిపోయింది. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు.
సిరిసిల్ల జిల్లాలో..
కరీంనగర్ జిల్లాలో పిడుగుపాటుకు ధ్వంసమైన ఇల్లు
వెల్గటూర్..కోటిలింగాల వద్ద ఉద్బుతంగా ప్రవహిస్తున్న గోదావరి నది.