హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో 24 గంటల్లోపు తూర్పు, మధ్య బంగాళాఖా తం ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 22నాటికి వాయుగుండంగా, 23నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది.
24నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతానికి చేరే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పశ్చి మ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 24 నాటికి మరో వాయుగుండం ఏ ర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో అక్టోబర్ 24, 25న విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.