వానొచ్చె.. వరదొచ్చె..
మెదక్, సంగారెడ్డి జిల్లాలు జలకళను సంతరించుకున్నాయి. నాలుగురోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ప్రాజెక్టులకు గంటగంటకూ ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. సింగూరు ప్రాజెక్టులోకి 12,515 క్యూసెక్కులు, నల్లవాగులోకి 1130 క్యూసెక్కుల వరద వచ్చింది. పలుచోట్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.
- వరుణుడు దంచి కొట్టంగా.. పోచారం పొంగిపొర్లంగా..
- తగ్గుముఖం పట్టిన వాన
- ఇండ్లకే పరిమితమైన ప్రజలు
- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
- అలుగు పారుతున్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు
- జలమయమైన లోతట్టు ప్రాంతాలు
- పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
- పంట పొలాల్లోకి వరద నీరు, పలుచోట్ల కూలిన ఇండ్లు
- సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు
- మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
- సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల్లోకి కొనసాగుతున్న వరద
- నిండిన నారింజ ప్రాజెక్టు, ఒక గేటు ఎత్తివేత
- సరాసరి మెదక్ జిల్లాలో 83.9 మి.మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 40.3 మి.మీటర్ల వర్షపాతం
మెదక్, సంగారెడ్డి జిల్లాలు జలకళను సంతరించుకున్నాయి. నాలుగురోజులుగా కురుస్తున్న వానలతో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ప్రాజెక్టులకు గంటగంటకూ ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. సింగూరు ప్రాజెక్టులోకి 12,515 క్యూసెక్కులు, నల్లవాగులోకి 1130 క్యూసెక్కుల వరద వచ్చింది. పలుచోట్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. మెదక్ జిల్లాలో శుక్రవారం 83.9 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, అత్యధికంగా చిలిపిచెడ్ మండలంలో 118.2 మి.మీ, అత్యల్పంగా నిజాంపేట మండలంలో 52.8 మి.మీ కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 40.3 మి.మీటర్లు నమోదవ్వగా, అత్యధికంగా పుల్కల్ మండలంలో 10.2 మీ.మీటర్ల వర్షం పడింది. జహీరాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ శరత్‌కుమార్, ఎమ్మెల్యే మాణిక్‌రావు పరిశీలించారు.
అల్పపీడనంతో నాలుగు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తప్ప ఎక్కడా జనసందోహం ఎక్కువగా కనిపించలేదు. అంతరాయం లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. మత్స్యకారులు చేపలు పడుతుండగా, ఆయా జలవనరుల వద్ద పలువరు చేపలు పట్టడం కనిపించింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, కొన్ని గ్రామాల మధ్య ఉన్న వాగుల్లో వరద ఉధృతికి రోడ్లు మునిగాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పంటపొలాల్లోకి వరద నీరు వచ్చి చేరగా, పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. – మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, జూలై 21
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?



