శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:46:25

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

  • చురుకుగా నైరుతి రుతుపవనాలు 

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విదర్భ నుంచి తెలంగాణ వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు రుతు పవనాలు చురుకుగా కదులుతునన్నాయి. వీటి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ, మరికొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురువొచ్చని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శుక్రవారంనుంచి మూడ్రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలే ఉంటాయని ఆయన చెప్పారు. మరోవైపు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. గ్రేటర్‌లో రాగల మూడ్రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 


logo