హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల మంగళవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాంయత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలంలో 2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు టీఎస్డీపీఎస్ వెల్లడించింది.