Weather Update | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదురోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లో అకడకడ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అకడకడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపింది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 7.2సెం.మీ వర్షపాతం నమోదైంది.