హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, ఓయూ క్యాంపస్, లాలాపేట, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లో వర్షం కురుస్తున్నది. బోరబండ, అల్లాపూర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్ఐ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, రహమత్‌నగర్, వెంగళరావునగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల్లోనూ వానపడుతున్నది.
పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బాలానగర్, జీడిమెట్ల, చింతల్, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్, గాజులరామారం, దుండిగల్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్నది. సికింద్రాబాద్, బోయినపల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, అల్వాల్, బేగంపేట, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, బుద్వేల్, గండిపేట్, శంషాబాద్, గగన్‌పహాడ్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్నది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో రోడ్లపైకి నీరు చేరింది. రోడ్లవెంట వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది.