Weather Report | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, సోమ, మంగళవారాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని వివరించింది.