Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం..
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆదిలాబాద్, జైనాథ్, తాంసీ, తలమడుగు, బేల మండలాలతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం (Rain) కురుస్తున్నది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆదిలాబాద్, జైనాథ్, తాంసీ, తలమడుగు, బేల మండలాలతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం (Rain) కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఉదయం నుంచి నిరాటంకంగా కురుస్తున్న వర్షం వల్ల అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా వ్యవసాయ పనులకు ఆటకం ఏర్పడింది.
మరో మూడు రోజులు వానలు.. పలు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Bela
- Heavy Rain
- Jainath
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

