హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. కాగా, వికారాబాద్ జిల్లా కురుస్తున్న కుండ వర్షాలకు జనం అతాలకుతలం అవుతున్నారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చించల్ పేట అక్నాపూర్ గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. పరిగి నస్కల్ వాగు, బూరుగుపల్లి, మైలార్దేవ్పల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు వాగులు దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఎవరు కూడా బయటకు రావొద్దని సూచిస్తున్నారు.