కొత్తగూడెం టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత వారం రోజుల నుండి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరింది. బస్టాండ్ సమీపంలో గల అండర్ బ్రిడ్జిలో నీరు చేరడంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.