హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): వచ్చే మూడ్రోజుల్లో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావం తో ఈనెల 17నుంచి 19వరకు, 23 నుంచి 28వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసిన ట్టు వెల్లడించింది. రుతుపవనాలు కూ డా రానున్న రెండు, మూడు రోజుల్లో బలపడనున్నట్టు పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రం గారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసినట్టు వివరించింది. శుక్ర, శనివారాల్లో అన్ని జిల్లా ల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్టు వెల్లడించింది.