భూపాలపల్లి రూరల్, జూలై 17 : జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సింగరేణి ఉపరితల (ఓసీ) బొగ్గు గనుల్లో భారీగా నీరు, మట్టి చేరి ఉత్పత్తికి అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. భూపాలపల్లి ఓసీ-2, 3 గనుల్లో 6 వేల టన్నులు, తాడిచర్ల ఓసీలో 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని చెప్పారు. సింగరేణికి దాదాపు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు.