అంతర్గాం, ఆగస్టు 28 : భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఎస్ఆర్ఎస్సి నుండి 3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీపాద ఎల్లంపల్లి జలశాయానికి చేరుతుంది. కడెం ప్రాజెక్టు నుండి 41 వెల క్యూసెక్కుల వరద నీరు వర్షం ద్వారా 4 లక్షల 21 వెల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు చేరడంతో ఇన్ ఫ్లో 8 లక్షల 24 వెల 432 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 40 గేట్లు ఎత్తి 6లక్షల 29 వెల 880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదిలో నీటి శాతం అధికంగా పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాల గ్రామీణ ప్రాంత ప్రజానీకాన్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టుకు లెవల్ 148.00 కాగా ప్రస్తుతం 146.59 లెవెల్ లో ఉంది. 20.175 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 1 16.3621టీఎంసీల నీరు నిల్వ ఉంది. భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 3 లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న క్రమంలో గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.