హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపా టు, రాష్ట్రంలోనూ మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గురువారం గోదావరి, కృష్ణమ్మలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టుల కు వరద వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్టుకు 1.31 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 16 వరద గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లికి 4.16 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 30 గేట్లు ఎత్తారు. ప్రాణహిత నుంచి 3.31 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, మొత్తంగా సమ్మక్కసాగర్ వద్ద 9.36 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.
మరోవైపు కృష్ణాలోనూ వరద క్రమంగా పెరుగుతున్నది. ఎగువ రాష్ర్టాల్లోని ప్రాజెక్టు లు పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకోగా దిగువకు జలాలను వదిలేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు లక్ష క్యూసెక్కులు వరద వస్తుండ గా 17 గేట్లు ఎత్తి, దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు సై తం 19 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఇక ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం పం పుల ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
(29.7.26 సాయంత్రం 6 నుంచి 30.7.26 సాయంత్రం 6 వరకు)
గత 24 గంటల్లో ఏపీకి పారిన నీళ్లు10 టీఎంసీలు
శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 1,12,753 క్యూసెక్కులు
(29.7.26 సాయంత్రం 6 నుంచి 30.7.26 సాయంత్రం 6 వరకు)
గత 24 గంటల్లో ఏపీకి పారిన నీళ్లు29.57 టీఎంసీలు
ఈ సీజన్లో వృథాగా పోయిన నీళ్లు 165.37 టీఎంసీలు
మేడిగడ్డ వద్ద ప్రస్తుత నీటిప్రవాహం 3,31,265 క్యూసెక్కులు

