Nagarjuna Sagar | ఎగువ నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 985.30 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నిల్వ 298.30 టీఎంసీలు ఉన్నది. ప్రస్తుతం జలాశయానికి 3,74,649 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 3,54,684 క్యూసెక్కులుగా ఉన్నది. మరో వైపు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతున్నది. దీంతో పదిగేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు.. ప్రస్తుతం 883 అడుగుల మేర నీరు చేసింది. ప్రస్తుతం డ్యామ్‌లో 204.35 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నది. కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.