వికారాబాద్, నవంబర్ 28, (నమస్తే తెలంగాణ): లగచర్ల కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ జిల్లా కోర్టు డిసెంబర్ 2కు వాయిదా వేసింది. 13న నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. లగచర్ల రైతుల బెయిల్ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు నేటికి వాయిదా వేసింది. లగచర్ల కేసులో రిమాండ్‌లో ఉన్న రైతుల్లో 21 మంది బెయిల్ పిటిషన్‌పై న్యాయవాదులు జక్కుల లక్ష్మణ్, రామచంద్రరావు వాదించారు.
రైతుల అభిప్రాయం తీసుకోకుండానే భూములు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, కలెక్టర్‌పై దాడి జరగలేదని తెలిపినప్పటికీ రైతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు న్యాయవాదులు లక్ష్మణ్, రామచంద్రరావు తెలిపారు. ఘటనలో 29 మందిని రిమాండ్‌కు తరలించారు.