హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ఓఎంసీ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి దాఖలుచేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 3కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. శ్రీలక్ష్మిపై కేసును కొట్టివేయడాన్ని సీబీఐ.. సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఈ కేసును తిరిగి విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.
శ్రీలక్ష్మి పిటిషన్ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపారు. ఐఏఎస్ అధికారి కృపానందం, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిందని శ్రీలక్ష్మి న్యాయవాది చెప్పారు.