హైదరాబాద్, ఫిబ్రవరి 25 ( నమస్తే తెలంగాణ ) : జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సు ప్రీం కోర్టులో విచారణ మార్చి 18కి వాయిదా పడింది. తెలంగాణలో సాగునీటి అవసరాలతోపాటు ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుత్తును ఉత్పత్తి చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, జీవో 34ను జారీ చేయగా ఏపీ సర్కారు అభ్యంతరం తెలిపింది. పరిమితులు లేకుండా విద్యుత్తు ఉత్పత్తికి నీటిని మళ్లించ డం సరికాదని, ఆ జీవోను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయా న్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపిం ది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినించారు. వాటిపై అభిప్రాయాలను తెలపాలని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి 2 వారాల్లోగా వివరాలను సమర్పిస్తానని వైద్యనాథన్ స్పష్టం చేయడంతో తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.