హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల ఎన్నికల గడువుకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 25న విచారణ చేపడతామని హైకోర్టు పేరొంది.
బార్ అసోసియేషన్ పాలకవర్గం పదవీ కాలాన్ని రెండేండ్లపాటు పొడిగించాలన్న అభ్యర్థనను రాష్ట్ర బార్ కౌన్సిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్‌తోపాటు మరో 24 అసోసియేషన్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.