హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య (ఏ4)దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మత్తయ్యను విచారించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
మత్తయ్యపై ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ప్రకటించింది.