Arogya Mahila | ఆరోగ్య మహిళ @ 70వేలు
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 70వేల మంది మహిళలకు పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 ఉమెన్ క్లినిక్స్‌లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), రక్త హీనత (అనీమియా) పరీక్షలు,అవసరమైన వారికి టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు.
- 25 వేలు దాటిన వైద్య పరీక్షలు
- 650 మందిలో క్యాన్సర్ లక్షణాలు
- 22 మందికి నిర్ధారణ, చికిత్స ప్రారంభం
Arogya Mahila | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 70వేల మంది మహిళలకు పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 ఉమెన్ క్లినిక్స్‌లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), రక్త హీనత (అనీమియా) పరీక్షలు,అవసరమైన వారికి టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. రిపోర్టులను 24 గంటలలోపే అందిస్తారు. సమస్యలను గుర్తిస్తే, అక్కడికక్కడే తగిన మందులు ఇస్తున్నారు. అవసరమైతే పైదవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. ఇప్పటివరకు 25వేల మంది మహిళలకు టెస్టులు నిర్వహించారు.
22 మందికి క్యాన్సర్ నిర్ధారణ
దేశంలో క్యాన్సర్ బారినపడిన మహిళల్లో 25 శాతం మందికి నోరు(ఓరల్), రొమ్ము (బ్రెస్ట్), గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్) క్యాన్సర్ బాధితులే. ఈ నేపథ్యంలో ఉమెన్ క్లీనిక్స్ ద్వారా ప్రభుత్వం క్యాన్సర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. 30 ఏండ్లకు పైబడిన మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. లక్షణాల ఆధారంగా సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లకు పరీక్షలు చేస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని జిల్లా దవాఖానలు లేదా టీచింగ్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తున్నారు.
- గత నెల 24వ తేదీ నాటికి సుమారు 4,310 మందిని రెఫర్ చేశారు. ఇందులో 2,361 మంది రెఫరల్ సెంటర్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.
- ఇందులో ప్రధానంగా 321 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, 241 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, 91 మందికి నోటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు
- బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలున్న 56 మంది, ఓరల్ క్యాన్సర్ ఉన్న 23 మంది, సర్వైకల్ క్యాన్సర్ ఉన్న 38 మందిని హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కు రెఫర్ చేశారు.
- అక్కడ పరీక్షలు నిర్వహించగా, ఫలితాల ఆధారంగా ఇప్పటివరకు 22 మందికి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ఇందులో రొమ్ము క్యాన్సర్ బాధితులు 11 మంది, సర్వైకల్ క్యాన్సర్ బాధితులు 10 మంది, ఒక ఓరల్ క్యాన్సర్ రోగి ఉన్నారు.
- మొత్తం 979 మంది మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్) ఉన్నట్టు క్లినిక్‌ల్లో గుర్తించి, పైదవాఖానలకు రెఫర్ చేశారు. ఇందులో 295 మందికి నిర్ధారణ కాగా, చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

