Damodara Raja Narsimha | రేపు 24 గంటలూ మెడికల్ షాపులు తెరిచి ఉంచాలి..!
Damodara Raja Narsimha : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్(AIOCD) రేపు (మే 20) దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలిచ్చారు.
Damodara Raja Narsimha : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్(AIOCD) రేపు (మే 20) దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలిచ్చారు. మెడికల్ షాపుల బంద్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
మెడికల్ షాపుల బంద్ ప్రభావం రోగులపై, అత్యవసర మందులు ఉపయోగించే వారిపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన్లు సహా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బుధవారం 24 గంటల పాటు ఫార్మసీలు తెరిచి ఉంచాలని, ఫార్మసిస్టులను కూడా అందబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులకు మంత్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

