హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రాన ఉన్న వేళ బడ్జెట్ కేటాయింపులపై వైద్య శాఖ గంపెడాశలు పెట్టుకున్నది. అసెంబ్లీలో ఈ నెల మూడో వారం 2025-26 వార్షిక బడ్జె ట్ సమావేశాలు జరుగునుండటంతో వైద్యశాఖతోపాటు ఇతర కీలక శాఖలకు జరపాల్సిన కేటాయింపులపై ఆర్థికశాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వైద్యశాఖకు జరపాల్సి న కేటాయింపులపై తర్జనభర్జన పడుతున్న ది. బడ్జెట్ కేటాయింపులపై వైద్యశాఖ పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం ఎలా నేరవేరుస్తుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు బడ్జెట్లో రూ.10,996 కోట్లు కేటాయించారు. 2025-26 వార్షిక బడ్జెట్లో తమకు రూ.17,448 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి వైద్యశాఖ ప్రతిపాదించింది.