Health Cards | జూన్ 1లోగా ఉద్యోగులకు హెల్త్‌కార్డులు..100 రోజుల్లోగా పెన్షనర్లకు రూ.6 వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్యభద్రత కార్డులను అందజేయడంతోపాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖానల్లో నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
- 100 రోజుల్లోగా పెన్షనర్లకు రూ.6 వేల కోట్లు
- పీఆర్సీపై వెంటనే రిపోర్టు తెప్పించుకుంటాం
- ప్రతి 2 నెలలకోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
- ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్యభద్రత కార్డులను అందజేయడంతోపాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖానల్లో నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులతో కలిసి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్ల బకాయిలను 100 రోజుల్లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీపై వెంటనే రిపోర్టు అందజేయాల్సిందిగా అధికారుల కమిటీని ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎస్ సమక్షంలో ఈ నెల 15న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని, సీఎస్ నేతృత్వంలో ప్రతి 2 నెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సీపీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించారు. 2004కు ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్‌ను వర్తింపజేసే అంశాన్ని సైతం పరిశీలించాలని ఆయనకు సూచించారు.
ఆందోళనల విరమణ: జేఏసీ
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఉద్యమంలో భాగంగా ఈ నెల 5న జిల్లా కలెక్టరేట్ల ముందు సామూహిక నిరాహార దీక్షలను విరమిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యోగుల 4ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడమే ఇందుకు కారణమని తెలిపారు. మే 5న తలపెట్టిన ఆందోళనను ఉద్యోగ సంఘాల జేఏసీ (లచ్చిరెడ్డి వర్గం) సైతం విరమించింది. సీఎంతో సమావేశమైన వారిలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పుల్గం దామోదర్‌రెడ్డి, బీ శ్యామ్, ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), వంగ రవీందర్‌రెడ్డి, జీ సదానందంగౌడ్, కటకం రమేశ్, మాచర్ల రామకృష్ణగౌడ్, వొడ్నాల రాజశేఖర్, రాములు, కే రామకృష్ణ, వెంకటేశం, డాక్టర్ నిర్మల తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

