నిర్మల్ అర్బన్, జూన్ 17: ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కారు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. నిర్మల్ పట్టణంలోని పాత మార్కెట్ ఏరియాలో శుక్రవారం మంత్రి బస్తీ దవాఖానను ప్రారంభించారు.
ఈ సందర్బంగా అల్లోల మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు, రోగాలను ప్రాథమిక దశలోనే కట్టడి చేసేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, యోగా లాంటివి చేయాలని సూచించారు.