హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎండీసీ మారథాన్లో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ 21 కిలోమీటర్ల రన్నింగ్ పూర్తి చేశాడు. మంగళవారం ఆయనను ఐజీ సత్యనారాయణ ప్రశంసించారు.
గతంలో 42 కిలోమీటర్ల దూరం పరిగెత్తడంతోపాటు హైదరాబాద్ సొసైటీ నిర్వహించిన మారథాన్లో మూడోసారి పాల్గొనడంపై ఐజీ అభినందించారు.