కోదాడ, ఫిబ్రవరి 24 : సామాన్యులకు సత్వర న్యాయం అందేలా న్యాయవాదులు నిబద్ధతతో కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే సూచించారు. సూర్యాపేటలో రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు కోదాడ కోర్టులో సబ్‌కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ప్రారంభించారు. నూతన కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీజే మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను తగ్గించేందుకు అదనపు కోర్టులను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అదనపు కోర్టులు దోహద పడతాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో న్యాయమూర్తులు వినోద్‌కుమార్, లక్ష్మణ్, విజయసేనారెడ్డి, కార్తీక్, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు పాల్గొన్నారు.