మమబూబ్‌నగర్ టౌన్, జూలై 28 : దళితబంధుతో దర్జాగా బతుకుతున్నట్టు ఓ లబ్ధిదారుడు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లోని వివేకానందనగర్‌లో శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్డు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ లైన్ వెపు వస్తూ భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లారు. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పనులు ఎలా ఉన్నాయి?’ అని మంత్రి ప్రశ్నించారు. దళితబంధు పథకంతో సెంట్రింగ్ మెటీరియల్ తెచ్చుకొని ఉపాధి పొందుతున్నట్టు కొత్తపేట శేఖర్ అనే లబ్ధిదారుడు మంత్రికి వివరించారు. ఖర్చులు పోగా నెలకు రూ.50 వేలు మిగులుతుందని చెప్పారు. దళితబంధు అందించిన సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.