మద్నూర్, సెప్టెంబర్ 15: తాను రెండో పెండ్లి చేసుకుంటానంటే ఒప్పకోవట్లేదన్న కోపంతో ఓ కొడుకు కన్న తల్లిని దారుణం గా హతమార్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మొగ గ్రామం లో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌బీ (55) భర్త మహబూబ్ సాబ్ దంపతులు.
వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు గ్రామంలోనే ఉంటుండగా, చిన్న కుమారుడు సలావుద్దీన్ హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తుంటాడు. సలావుద్దీన్ భార్య రెండేండ్ల కిందట గుండెపోటుతో చనిపోయింది. మూడ్రోజుల క్రితం గ్రామానికి వచ్చిన సలావుద్దీన్.. తనకు రెండో పెండ్లి చేయాలని బుధవారం రాత్రి తల్లితో గొడవపడ్డాడు. అందుకు తల్లి అంగీ కరించలేదు. దీంతో నిద్రిస్తున్న తల్లిపై గొడ్డలితో దాడిచేయడంతో ఆమె అక్కడి కక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు సలావుద్దీన్‌ను అరెస్టు చేశారు.