సిద్దిపేట రూరల్, అక్టోబర్ 9: ఎరుకల సాధికారత పథకాన్ని తెచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని, అందుకే ఎన్నికల్లో మంత్రి హరీశ్‌రావును మరోసారి గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేస్తామని సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన ఎరుకల సంఘం ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోమవారం వారు మంత్రి హరీశ్‌రావును కలిసి మద్దతు ప్రకటించి తీర్మాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్దిపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసిన హరీశ్‌రావుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. హైదరాబాద్‌లో ఎరుకల భవనాన్ని నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.