హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నెట్, నీట్ పరీక్షల వివాదం సందర్భంగా పరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం వేసిన అత్యున్నత నిపుణల కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు సభ్యుడిగా నియమితులయ్యారు.
ఇస్రో మాజీ చీఫ్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కేంద్రం కమిటీని ఏర్పాటుచేసింది. కీలకమైన ఈ కమిటీలో హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ బీజే రావుకు చోటుదక్కింది. తెలుగు రాష్ర్టాల నుంచి బీజేరావు ఒక్కరికే కమిటీలో చోటు దక్కింది.