హైదరాబాద్: సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచిన కేసులో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ.. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.
జూన్ 2న.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగోల్‌లోని బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో అమరుల యాదిలో పేరుతో బీజేపీ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ఓ నాటకం ప్రదర్శించారు. ఇదే విషయంలో నాలుగు రోజుల క్రితం బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.