హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసిన విషయం విదితమే. జీహెచ్ఎంసీ పరిధిలో 19.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. నగర వ్యాప్తంగా వర్షపాతం చూస్తే.. హయత్‌నగర్‌లో అత్యధికంగా 51 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, వెస్ట్ మారేడుపల్లిలో 47.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. మారేడుపల్లి, వనస్థలిపురం, సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో రాత్రంతా భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, ఆసిఫ్‌నగర్, కాప్రాలో మోస్తరు వర్షం కురిసింది. రాబోయే కొద్ది రోజుల పాటు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.