హైదరాబాద్‌లో ఇల్లు.. ఓటు మాత్రం సొంతూర్లో!
హైదరాబాద్‌లో దశాబ్దాలుగా నివసిస్తూ, ఇకడే ఇండ్లు, వ్యాపారాలు, వృత్తిపరమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలువురు ఓటు హకు విషయానికి వచ్చేసరికి సొంత ప్రాంతాలకే మొగ్గుచూపారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు తెలుగు సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖుల్లో చాలామంది దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నారు.
- మూడు నియోజకవర్గాల్లో భారీగా తగ్గిన ఓటర్లు
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో దశాబ్దాలుగా నివసిస్తూ, ఇకడే ఇండ్లు, వ్యాపారాలు, వృత్తిపరమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలువురు ఓటు హకు విషయానికి వచ్చేసరికి సొంత ప్రాంతాలకే మొగ్గుచూపారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు తెలుగు సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖుల్లో చాలామంది దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నారు. తమ వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఎకువ సమయం హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. అయితే ఓటు విషయానికి వచ్చేసరికి మాత్రం చాలామంది సొంత ఊరినే ఎంచుకున్నట్టు ‘సర్’ సందర్భంగా వెలుగుచూసిన గణాంకాలు చెప్తున్నాయి.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో సినీ ప్రముఖులు కొన్నేండ్లుగా ఉంటున్నారు. 2026 జూన్ 10వ తేదీనాటికి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 6,35,283 మంది ఉండగా, వీరిలో 1,32,063 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్టు బీఎల్వోలు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లో 4,06,729 మంది ఓటర్లకుగాను 1,48,859 మంది, ఖైరతాబాద్‌లో 2,93,667 మందికిగాను 95,082 మంది తరలివెళ్లినట్టు గుర్తించారు. ఈ లెక్కన మూడు నియోజకవర్గాల్లో కలిపి మూడున్నర లక్షలకు పైగా ఓటర్లు తగ్గారు. అయితే, ఇందులో ఎంత మంది సినీ ప్రముఖులు ఉన్నారనేది మాత్రం తెలియడం లేదు. పలువురు ప్రముఖులు తమ స్వస్థలాల్లో వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు కలిగి ఉండటం వల్ల అకడ ఓటు హకు కొనసాగించాలనుకున్నారని అధికారులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

