ఎండిన చెట్టు చిగురించినట్లు ఉందీ కదూ దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూస్తే.. అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. అవి ఆకులు కాదు పక్షులు అంటే నమ్మలేం. ఈ సమ్మోహన దృశ్యం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో చోటు చేసుకుంది.
ఓ వ్యవసాయ పొలంలో ఎండిన టేకు చెట్టుపై గోరెంకలు వాలడంతో మోడు వారిన చెట్టు అచ్చం చిగురించినట్లుగా కనువిందు చేయడంతో నమస్తే తెలంగాణ క్లిక్‌మనిపించింది.