హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): హర్యానా ప్రజలు కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటకలో 5గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలని అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, 7 గ్యారెంటీల పేరిట హర్యానా ప్రజలను మభ్యపెట్టాలని చూసిందని, కానీ అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టారని విమర్శించారు. హామీల అమలులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తు న్న మోసాన్ని దేశం మొత్తం గమనిస్తున్నద ని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రాంతీయ పార్టీలకే సత్తా
కాంగ్రెస్‌తో హోరాహోరీ ఉన్న రాష్ర్టాల్లోనే బీజేపీ గెలుస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఆ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ బలహీన నాయకత్వం కూడా ప్రధాన కా రణమని స్పష్టంచేశారు. బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉన్నదని, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఫలితాలు కూడా రెండు జాతీయ పార్టీల కు ఏమాత్రం ఆశాజనకంగా ఉండే అవకాశం లేదని తెలిపారు. ఈ ఫలితాలు చూ స్తుంటే 2029లో జాతీయ పార్టీలైన బీజే పీ, కాంగ్రెస్‌కు సాధారణ మెజార్టీ సాధ్యం కాదన్నది తెలిసిపోతున్నదని వివరించా రు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ బుల్డోజర్రాజ్లు, పార్టీ ఫిరాయింపులు, రా జ్యాంగాన్ని తుంగలో తొకే వ్యవహారాలు నడుస్తుంటే రాహుల్ గాంధీ చూసీ చూడనట్టు వ్యవహరించిన తీరును దేశం గమనిస్తున్నదని, పిల్లి కండ్లు మూసుకొని పా లు తాగిన చందంగా తాను చేసే పనులను ప్రజలు గుర్తించరని భావించటం రాహుల్‌గాంధీ అమాయకత్వమని పేర్కొన్నారు.
దండగ మారి పాలనలో పస్తులు
పండుగ సమయంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలను పస్తులుంచొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ‘దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు’ అని ఘాటుగా వి మర్శించారు. పంచాయతీ వరర్స్, ము న్సిపాలిటీ కార్మికులు, హాస్పిటల్ సిబ్బం ది, హాస్టల్ వరర్స్, గెస్ట్ లెక్చరర్స్ ఇలా ప్రతిశాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు విలవిలలాడుతున్నారని తెలిపారు.
గౌతంగౌడ్ పోస్టులో తప్పేముంది?
జర్నలిస్టు గౌతంగౌడ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో తప్పేముందని డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ వీడియో షేర్ చేసినందుకు కేసు పెడతారా? అని ఎక్స్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రైతు మల్లయ్యను వారి స్వగ్రామంలో తాను కూడా కలిశానని, రైతు పరిస్థితి ఎలా ఉందో ఆరా తీశానని, అంతమాత్రానికే కేసు పెడతారా? అని ప్రశ్నించారు.
‘అలవి కాని హామీలతో గద్దెనెకాలని చూసిన కాంగ్రెస్‌కు జనం కర్రుకాల్చి వాత పెట్టారు. హర్యానా ప్రజల తీర్పుతో గ్యారెంటీలకు వారెంటీ లేదని స్పష్టంగా తేలిపోయింది.
-కేటీఆర్
హర్యానాలో ఓటమితోనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవా లి. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలుచేయకుంటే కాంగ్రెస్‌కు ఇంతకంటే పెద్ద ఎదురుదెబ్బలు తప్పవు.
-కేటీఆర్
కాంగ్రెస్‌తో పోటీ ఉన్న చోటే బీజేపీ గెలుస్తున్నది.. బీజేపీని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉన్నదనే విషయం ఇప్పటి కే అనేక రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికలు స్పష్టం చేసినయ్. దేశంలో సమాఖ్యస్ఫూర్తిని, సమగ్రతను కాపాడాలని కోరుకునే మేధావులు, ప్రజలంతా ప్రాంతీయ పార్టీలకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది.
-కేటీఆర్