యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం దేశం గర్వపడే మహాక్షేత్రంగా వెలుగొందుతున్నదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్రావు మహాప్రసాదంతోపాటు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
అనంతరం భువనగిరి పట్టణ పరిధిలోని స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించారు. స్వర్ణగిరి దేవాలయం ప్రాచీన సంస్కృతి వాంగ్మయం ఉట్టిపడేలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారని, ఈ దేవాలయం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెకుతుందని చెప్పారు.