హైదరాబాద్;రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాల్లో అనిశ్చితి నెలకొనకుండా అవిశ్వాస తీర్మాన సమయాన్ని నాలుగేండ్లకు పెంచడం పట్ల తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు వెన్‌రెడ్డి రాజు హర్షం ప్రకటించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం హిమాయత్‌నగర్‌లోని కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు రామ్మోహన్‌రెడ్డి, సీహెచ్ మంజుల, సీతామహాలక్ష్మి, ఎడ్మ సత్యం, గద్వాల కేశవ్, డీ వెంకటేశ్వర్రావు, సుష్మ, ఈశ్వర్, శిరీష, జమున, నర్సింహ పాల్గొన్నారు. –