హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశ భవిష్యత్ తరగతి గదిలోనే నిర్మితం అవుతుందన్న మాటలకు కేసీఆర్ అక్షర రూపం ఇస్తే, రేవంత్‌రెడ్డి మాత్రం వెన్నెముకనే విరిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. విద్యావ్యవస్థను కేసీఆర్ బలోపేతం చేస్తే, రేవంత్‌రెడ్డి బలహీనం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పతనావస్థకు చేరుకున్నదని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నేడు రాష్ట్రంలో పురుగులు లేని భోజనం కోసం, పాముకాట్లు, ఎలుక కాట్లు లేని వసతి కోసం, కనీస సౌకర్యాల కల్పన కోసం తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్న దయనీయ పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు.
ఒకవైపు టీచర్లు లేని కారణంగా బడులు మూతబడుతుం టే, మరోవైపు ప్రభుత్వ బడుల మీద విశ్వా సం సన్నగిల్లడంతో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని ఉదహరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ విద్యా సంవత్సరం లో ఒక విద్యార్థి కూడా లేని పాఠశాలలు 1,864 ఉంటే, 30లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 9,447 ఉన్నాయని, వందలోపు విద్యార్థులు మాత్రమే ఉన్న పాఠశాలలు 9,609 ఉన్నాయని వివరించారు. రేవంత్‌రెడ్డి పాలనలో మొత్తం 26,287 పాఠశాలలకుగాను దాదాపు 20 వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని దుయ్యబట్టారు.
ప్రభుత్వ పాఠశాలల స్థితి రోజురోజుకు దిగజారుతుంటే, గురుకులాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఖ్యాతి గడించిన గురుకులాలు, రేవంత్‌రెడ్డి పాలనలో సమస్యలకు నిలయాలుగా మారాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో పటిష్టపరిచిన గురుకులాలను కాం గ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే ధ్వం సం చేసిందని ఆరోపించారు.
సంక్షేమ హాస్టళ్లను సంక్షోభ హాస్టళ్లుగా మార్చిన ఘ నత రేవంత్ సర్కార్కే దక్కిందని ఎద్దేవా చేశారు. పాఠశాల నుంచి కళాశాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏ హాస్టల్ చూసి నా దుర్భర పరిస్థితులే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 715 మందికిపైగా వి ద్యార్థులు దవాఖానల పాలు కాగా, 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, ఇది అత్యంత బాధాకరమని, అయినా ప్ర భుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు.