Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక పెద్ద కబ్జాదారు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి అడ్డికి పావుశేరు లెక్కన భూములు కట్టాబెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేపీహెచ్బీలో ఒక్క గజమైనా అమ్మినామా అని ప్రశ్నించారు. కానీ అదే కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్లలో లక్ష ఎకరాల అసైన్డ్ భూములను అమ్మిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సెక్షన్ 22ఏ బాధితుల సమావేశం జరిగింది. కేపీహెచ్‌బీ ఎస్‌ఆర్‌ఎస్‌ఏ కమ్యూనిటీ హాలులో జరిగిన ఈ సమావేశంలో బాధితులతో హరీశ్‌రావు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు.. అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలకు కమీషన్లకు భూములు అమ్ముకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి తమ్ముడికి అడ్డికి పావుశేరు లెక్కన భూములు కట్టబెట్టారని విమర్శించారు. ప్రజల భూములేమో నిషేధిత జాబితాలోకి.. ప్రభుత్వ భూములేమో రేవంత్ సోదరుల చేతుల్లోకి వెళ్తోందని ధ్వజమెత్తారు. లక్ష ఎకరాల అసైన్డ్ భూములు అమ్మింది ఈ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక పెద్ద కబ్జాదారు అని విమర్శించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షంపై కాదు.. ప్రజలపై సెక్షన్ 22ఏ బాంబు వేశాడని హరీశ్‌రావు అన్నారు. రియల్ ఎస్టేట్ తెలుసు కనుకనే ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. మీకు కబ్జాలు తెలుసు.. మాకు పోరాటాలు తెలుసని పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూములను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవపెట్టిండు అని తెలిపారు. బ్రోకర్లకు రూ.700 కోట్లు లంచం ఇచ్చి రూ.15వేల కోట్ల అప్పు తెచ్చిండని పేర్కొన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200, ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలు లాక్కున్నాడని అన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ భూములను కూడా అమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములను అమ్మే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో యూఎల్సీ యాక్ట్‌ను రద్దు చేశారని గుర్తుచేశారు.2008కు ముందు యూఎల్‌సీలో ఉన్నాయని.. ఇప్పుడు భూములన్నీ సెక్షన్ 22ఏ జాబితాలో చేర్చారని తెలిపారు.
ఒకప్పుడు కూకట్‌పల్లిలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉండేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.450 కోట్లు కూకట్పల్లి అభివృద్ధికి ఇచ్చామని తెలిపారు. కూకట్‌పల్లిలో తాగునీరు, కరెంటు సమస్య లేకుండా చేశామని పేర్కొన్నారు.
కేసీఆర్ హైదరాబాద్ చుట్టూ టిమ్స్ ఆస్పత్రులు కట్టించారని హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో గల్లీగల్లీకి బస్తీ దవాఖానాలు పెట్టారని పేర్కొన్నారు. రేవంత్ పాలనలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే అక్కడ అమ్మకాలు జరిగేవని అన్నారు. పార్కులు, ప్లాట్లు, పట్టా భూములను ఏదీ విడవడం లేదని చెప్పారు. రెండున్నరేండ్లలో రూ.30 వేల కోట్ల భూములను రేవంత్ రెడ్డి అమ్మేసిండని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కేపీహెచ్బీలో గజం జాగా అయినా అమ్మినమా అని ప్రశ్నించారు. భావితరాలకు జాగా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
కబ్జాదారులే ధర్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం మెడలు వంచి మీకు న్యాయం చేసే బాధ్యత మాపై ఉందని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సెక్షన్ 22ఏను తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. మా పోరాటం ప్రజల కోసం.. రాజకీయాల కోసం కాదు అని అన్నారు. భేషరతుగా సెక్షన్ 22ఏ జాబితాలోని భూములన్నీ తొలగించకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. జెన్జీల పోరాటం దెబ్బకు కేంద్ర ప్రభుత్వమే షేక్ అయ్యిందని తెలిపారు. సెక్షన్ 22ఏ రద్దు చేయకుంటే ఢిల్లీ తరహా ఉద్యమాన్ని రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ర