హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : 22ఏ రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 22ఏ నిషేధిత జాబితా ముసుగులో ప్రజల ఆస్తులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా సిద్ధం చేసిన 22ఏ నిషేధిత జాబితాను తక్షణమే రద్దు చేయకపోతే వేలాది మంది బాధితులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని తిరుమల మె డోస్, లక్ష్మీగణపతి, హేమనగర్ కాలనీల్లో ప్ర భావిత ప్రజలకు బీఆర్ఎస్ భరోసానిచ్చేలా ఏ ర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.
మధ్యతరగతి ప్రజలు కష్టార్జితం, బ్యాంకు రుణంతో కట్టుకున్న ఇండ్లను కూడా నిషేధించి ఆస్తులపై హక్కులు లేకుండా చేసి పొట్టకొడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం 1999లోనే రద్దు చేసిన యూఎల్సీతో జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నదని, వైఎస్ఆర్ హయాంలోనూ ఈ చట్టా న్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింద ని గుర్తుచేశారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ జనాల మీదికి ఈ చట్టాన్ని ఎగదోసి దందాలకు తెగబడుతున్నదని ఆరోపించారు. దీంతో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయానికి గండిపడుతున్నదని, ఈ జాబితా మాటున కాంగ్రెస్ రాబందులు అక్రమ దందాకు తెరలేపారని మండిపడ్డారు. 30శాతం కమీషన్ల కోసం ప్రజల ఆస్తులను నిషేధించి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి దందాలు చేస్తున్నారని ఆ రోపించారు. ఈ దందాలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి నైతిక బాధ్యత వహించి రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఎకరాలను నిషేధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, కోర్ సిటీలోని కాలనీలను కూడా విడిచిపెట్టలేదని హరీశ్‌రావు చె ప్పారు. మేడ్చల్ జిల్లాలో 6వేలు, రంగారెడ్డిలో 7,500, యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు. ఓవైపు ప్రభుత్వ భూములను అమ్ముకుంటూనే, మరోవైపు పేద, మధ్యతరగతికి చెందిన ప్రైవేట్ ఆస్తులపై కాంగ్రెస్ రాబందులు కన్ను వేశారని విమర్శించారు. రాత్రికి రాత్రే భూభారతి పోర్టల్ నుంచి 22ఏ నిషేధిత జా బితా వివరాలను ప్రభుత్వం ఎందుకు మా యం చేసిందని, హైదరాబాద్ నగర సమాచారాన్ని ఎందుకు బ్లాక్ చేసిందని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర ఉన్నదని ఆరోపించారు. 2023 డిసెంబర్ నుంచి ఏ భూములను 22ఏలో చేర్చారో, దేని ఆధారంగా తొలగించారో సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని, దీనిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులైన రేవంత్ రెడ్డి, పొంగులేటి చేతిలో కాంగ్రెస్ హైకమాండ్ రా ష్ర్టాన్ని పెట్టిందని, వీరి అక్రమాలపై రాహుల్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని హరీశ్‌రా వు ప్రశ్నించారు. దందారాయుళ్ల నుంచి జనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. తప్పుగా చేర్చిన ప్రైవేట్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జనాల ఆస్తులపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడేవరకు బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ తరహాలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మ ల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, బోడుప్పల్‌లోని 22ఏ ప్రభావిత ప్రాంత బాధితులు పాల్గొన్నారు.