హైదరాబాద్: నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు సమృద్ధిగా లభించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రైతన్నలు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యంతో, అష్టఐశ్వర్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ ఎక్స్ వేదికగా శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.