Runa Mafi | మహబూబాబాద్, అక్టోబర్4(నమస్తే తెలంగాణ): రుణమాఫీ కాని రైతులకు అధికారుల నుంచి చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారులు అడుగుతున్న డాక్యుమెంట్ల వివరాలు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థంకాని పరిస్థితి! అసలు నాకు పెండ్లే కాలేదో మహాప్రభో అంటే.. అయితే, భార్య పేరిట ఆధార్‌కార్డు తీసుకురండి అని చెప్తున్నారు. ఎప్పుడో ఆధార్ అనేది పుట్టకముందే చనిపోయినవారి విషయంలోనూ ఆధార్ నంబర్ తెచ్చి ఇవ్వాలని కోరడం మరో తమాషా. ఇలాంటి ఉదంతాలను మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం నిర్వహించిన రైతుల మహాధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు వివరించారు.
‘సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌కు చెందిన ఎల్లారెడ్డికి రుణమాఫీ కాలేదు. ఆయ న అధికారుల వద్దకు వెళ్లి అడగితే భార్య ఆధార్‌కార్డు తెమ్మన్నారట.. ఆయన అసలు పెండ్లే చేసుకోలేదు. ఇప్పుడు భార్య పేరిట ఆధార్‌కార్డు ఎకడినుంచి తేవాలి. రుణమాఫీ కోసం ఈ వయసు లో పెండ్లి చేసుకోవాల్నా? అని ఆ రైతు అంటుం టే ఎంతో బాధపడ్డాను’ అని వివరించారు. ‘మ రో రైతు భార్య 2010లో చనిపోతే ఆధార్‌కార్డు తేవాలని అన్నారట. ఇలా మొత్తం 31 కొర్రీలతో రుణమాఫీ ఎగ్గొట్టారని దుయ్యబట్టారు.